News August 27, 2024

కడప జిల్లాలో చట్టబద్ధంగా ఇసుక సరఫరా.!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జేసీ అదితి సింగ్‌తో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.

Similar News

News July 11, 2025

ప్రొద్దుటూరు: 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు

image

ప్రొద్దుటూరులోని రామేశ్వరం పురపాలక ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. ఇక్కడ ఐదు తరగతులు ఉన్నాయి. నెల కిందట ఇక్కడ HM, ఆరుగురు టీచర్లు ఉండేవారు. బదిలీల తర్వాత ఇక్కడ ఇప్పుడు HM ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. టీచర్ల కొరతపై MEO దృష్టికి తీసుకెళ్లామని HM వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. టీచర్ల సర్దుబాటు తన పరిధిలో లేదని MEO సావిత్రమ్మ తెలిపారు.

News July 10, 2025

కడప జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు

image

కడప జిల్లాలో గురువారం భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. 169 పోలీస్ సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ SP అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 24 మంది ASIలు, 32 మంది HCలు, 113 మంది PCలు ఉన్నారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న, ఆరోపణలున్న వారిని బదిలీ చేసిన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వులను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.

News July 10, 2025

కడప MLA తీరుపై విమర్శలు

image

మొహర్రం సందర్భంగా నాదర్ షావలీ దర్గా ఉరుసు నిర్వహించారు. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కేసీ కెనాల్లో రొట్టెలు వదిలారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంతో పవిత్రంగా రొట్టెలు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే చెప్పులు ధరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పలువురు అంటున్నారు.