News April 25, 2024
కడప జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత వారంలో కడపలోని ఓ బిల్డింగ్‌లోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా వెల్లడైంది. సోమవారం రాత్రి మరికొన్ని చోట్ల తిరిగారని పోలీసులు అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాత్రివేళల్లో పెట్రోలింగ్ కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, రాత్రిళ్లు ఎవరైనా బట్టలు లేకుండా వీధుల్లో కనపడితే 100కు ఫోన్ చేయాలని తెలిపారు.
Similar News
News November 18, 2025
కడప: 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలు గుర్తించిన అధికారులు

జిల్లాలో గత ప్రభుత్వంలో ఫేజ్-3లో 13,681ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలను వైసీపీ నేతలు చేపట్టారు. ఇప్పుడు వీటిపై విచారణ జరుగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫిజికల్, ఫైనాన్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలున్నట్లు తెలిపారు. సుమారు 6,713 ఇళ్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 6,258 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.