News March 28, 2025
కడప జిల్లాలో తగ్గిన అరటికాయల ధరలు.!

కడప జిల్లాలో అరటి ధరలు అమాంతంగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టన్ను రూ.6వేల నుంచి రూ.9వేలు పలుకుతున్నాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు అరటి గెలలన్నీ నేలకూలడంతో నష్టపోయిన రైతులను తగ్గిన అరటి ధరలు మరింత కుంగదీస్తున్నాయి. గతంలో టన్ను అరటికాయలు రూ.16 నుంచి రూ.18వేలు పలికాయి. ప్రభుత్వం స్పందించి అరటికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. = రైతులను = అరటికాయలు రూ.16 వేల
Similar News
News December 4, 2025
11వ తేదీ కడప మేయర్ ఎన్నిక జరగకపోతే?

కడప మేయర్ ఎన్నికకు <<18470673>>నోటిఫికేషన్<<>> విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఒకవేళ 11వ తేదీ ఎన్నిక జరగకపోతే.. రిజర్వ్ డే (12వ తేది)న ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. అప్పటికీ ఎన్నిక జరగకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తర్వాతి తేదీని వెల్లడిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News December 4, 2025
BREAKING: కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

కడపలో ఖాళీగా ఉన్న మేయర్ స్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నూతన మేయర్ను ఎన్నుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పూర్వపు మేయర్ సురేశ్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేయడంతో ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ కొనసాగుతున్నారు. కడపలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి.
News December 4, 2025
కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢమాల్.!

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. జిల్లాలో 12 SROలు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26లో రూ.411.74 కోట్లు టార్గెట్ కాగా.. నవంబరు నాటికి రూ.181.73 కోట్లు మాత్రమే వచ్చింది. బద్వేల్-9.48, జమ్మలమడుగు-10.37, కమలాపురం-8.60, ప్రొద్దుటూరు-40.47, మైదుకూరు-7.10, ముద్దనూరు-3.44, పులివెందుల-11.96, సిద్దవటం-2.45, వేంపల్లె-6.14, దువ్వూరు-2.55, కడప-79.13 కోట్లు వచ్చింది.


