News August 24, 2024

కడప జిల్లాలో తగ్గుతున్న పులుల సంఖ్య.!

image

ఉమ్మడి కడప జిల్లాలో ఈ ఏడాది పులుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో YSR జిల్లా వ్యాప్తంగా, రాయచోటి రేంజిలోని అటవీ ప్రాంతాల్లో సాంకేతిక డిజిటల్‌ కెమెరాల ద్వారా గణన చేపట్టారు. ఉమ్మడి కడప జిల్లాలో గతేడాది 5 పులులుండగా ప్రస్తుతం 3 మాత్రమే ఉన్నట్లు తేల్చారు. కారణం ఆవాసాలు అనుకూలంగా లేకపోవడంతో అవి ఇతర ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అధికారులు వెల్లడించారు.

Similar News

News January 15, 2026

కడప బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం

image

కడపలో ఓ వ్యక్తి చేసిన తప్పిదంతో ప్రజలు హడలిపోయారు. పులివెందుల బస్సుకు తాళం అలాగే వదిలేసి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఈక్రమంలో ఓ యువకుడు బస్సు స్టార్ట్ చేశాడు. అప్పటికే అందులో ఉన్న ప్రయాణికులు అతడి తీరు చూసి భయంతో కేకలు వేశారు. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి మతిస్థిమితం సరిగా లేదని సమాచారం. పొరపాటున అతను డ్రైవ్ చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది.

News January 15, 2026

కడప: వైట్ అండ్ వైట్‌లో మెరిసిన పోలీసులు

image

నిరంతరం విధి నిర్వహణలో భాగంగా డ్రెస్‌లో కనిపించే పోలీస్ అధికారులు భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో కనువిందు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి భోగి పండుగను స్వాగతించారు. జిల్లా ఎస్పీతో సహా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా కనిపించారు.