News October 5, 2024
కడప జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ శివ శంకర్ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఉన్న ఎమ్మార్వోలకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే సంబంధిత ప్రదేశాలలో రిపోర్ట్ చేసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.
Similar News
News January 9, 2026
గండికోట ఉత్సవాలు.. నేడు కడపలో బైక్ ర్యాలీ

గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. రాజీవ్ మార్క్ సర్కిల్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్, ఎర్రముక్కపల్లి సర్కిల్, ఐటీఐ బిల్ట్ సర్కిల్, వినాయక నగర్ సర్కిల్, అల్మాస్పేట్ మాసాపేట సర్కిల్, అన్నమయ్య సర్కిల్, అప్సర హాల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జరుగుతుంది.
News January 8, 2026
ఒంటిమిట్ట: అమ్మమ్మను కత్తితో పొడిచాడు..!

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాఘవమ్మ(70) పొలంలో పనిచేస్తుండగా ఆమె మనవడు నంద(20) కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను 108లో కడప రిమ్స్కు తరలించారు. మద్యానికి డబ్బులు ఇవ్వకపోతేనే దాడి చేసినట్లు సమాచారం. నంద తల్లి కువైట్లో ఉండగా.. ప్రస్తుతం అతను అమ్మమ్మ రాఘవమ్మ దగ్గర ఉంటున్నాడు.
News January 8, 2026
గండికోటలో తొలిసారి హెలికాప్టర్ ఎక్కేయండి..!

గండికోట ఉత్సవాలు ఈనెల 11, 12, 13న జరగనున్నాయి. టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి అందించడానికి గండికోటలో మొదటిసారిగా హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున వసూళ్లు చేస్తారు. కాసేపు గండికోటలో హెలికాప్టర్లో తిప్పుతారు. సంబంధిత వాల్పోస్టర్లను కడప ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో TDP నేత శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.


