News October 1, 2024
కడప జిల్లాలో త్వరలో నూతన మద్యం పాలసీ అమలు
జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కట్టుదిట్టంగా, పూర్తిగా పారదర్శకంగా జరగాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. మద్యం దుకాణాల పాలసీపై జిల్లా కలెక్టర్ సంబంధిత ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్యం దుకాణాలను కేటాయించుటకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నదని చెప్పారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో 139 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించబోతున్నామన్నారు.
Similar News
News October 4, 2024
కడప: కుడా వైస్ ఛైర్మన్‌గా అదితి సింగ్
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్‌గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్‌ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.
News October 4, 2024
కడప: ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్లు
వైవీయూ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో నేరుగా ప్రవేశాలు (ఏ.పి.ఐ.సి.ఈ.టి-2024) కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ ప్రాంగణంలోని డీఓఏ కార్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రుసుంతో రావాలన్నారు.
News October 4, 2024
కడప: నూతన పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
కడప జిల్లాలో నూతన పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేపట్టి ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పేర్కొన్నారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జేసీ అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లాలో మొత్తం ఇప్పటికే 1941 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. జిల్లాలో 22 ప్రతిపాదనలు చేశామని, ఇందులో కడపలో 19, ప్రొద్దుటూరులో 1, కమలాపురంలో 2 కేంద్రాలు ఉన్నాయన్నారు.