News November 21, 2024
కడప జిల్లాలో దారుణ ఘటన

కడప జిల్లాలో గురువారం దారుణ ఘటన వెలుగుచూసింది. కాశినాయన మండలం చెన్నవరం – పాపిరెడ్డిపల్లి మధ్యలో 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల మహిళపై దుండగులు రాళ్ళతో దాడి చేసి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 8, 2025
రాయచోటిలో ప్రాణం తీసిన కుక్కలు

రాయచోటిలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఓ వ్యక్తి బైకుపై వస్తుండగా కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలో కుక్కలు వెంటపడ్డాయి. ఈక్రమంలో అతను అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడిక్కడే మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మృతుడు పజిల్(42)గా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 8, 2025
కడప: కరెంట్ సమస్యలు ఉన్నాయా.. ఈ నంబర్కు కాల్ చేయండి.!

కడప జిల్లాలో విద్యుత్ సమస్యలపై ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 వరకు డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ MD శివశంకర్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ప్రజలు 89777-16661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా వాసులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
News December 8, 2025
కడపలో నేరాలపై కఠిన చర్యలు.. ఎస్పీ నచికేత్ హెచ్చరిక

కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ షెల్కే నచికేత్ ఆదివారం తెలిపారు. నవంబర్ నెలలో 23.5 కిలోల గంజాయి, 1620 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్టు చేశారు. ఎంవీ యాక్ట్ ఉల్లంఘించిన వారిపై 6527 కేసులు నమోదు చేసి రూ.16.16 లక్షల జరిమానా విధించారు. గంజాయి, బెట్టింగ్ వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సమాచారం ఉంటే డయల్ 112కు తెలపాలని ఎస్పీ సూచించారు.


