News November 21, 2024
కడప జిల్లాలో దారుణ ఘటన
కడప జిల్లాలో గురువారం దారుణ ఘటన వెలుగుచూసింది. కాశినాయన మండలం చెన్నవరం – పాపిరెడ్డిపల్లి మధ్యలో 30 నుంచి 35 ఏళ్ల వయస్సు గల మహిళపై దుండగులు రాళ్ళతో దాడి చేసి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాళ్లతో తలను ఛిద్రం చేశారు. మహిళపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 9, 2024
రాయచోటిలో టీచర్ మృతి.. విద్యార్థుల అరెస్ట్
రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ZPHSలో ఉపాధ్యాయుడు అహ్మద్(42) మృతి కేసులో ఇద్దరు విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మైనర్లు కావడంతో శనివారం వారిని కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్‌కు తరలించారు. 9వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా అల్లరి చేస్తుండడంతో టీచర్ వారిని మందలించారని, దీంతో విద్యార్థులు కోపోద్రిక్తులై టీచర్‌పై దాడి చేసినట్లు సమాచారం.
News December 9, 2024
పులివెందుల యువతిని పొడిచిన వ్యక్తి అరెస్ట్?
కడప జిల్లా వేముల మండలం వి కొత్తపల్లికి చెందిన షర్మిల అనే యువతిపై అదే గ్రామానికి చెందిన కుల్లాయప్ప శనివారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కాగా తిరుపతి రుయాకు తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలతో SI ప్రవీణ్ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారై ఓ ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత సీరియస్ అయిన విషయం తెలిసిందే.
News December 9, 2024
కడప: ఉత్సాహంగా హ్యాండ్ బాల్ కడప జిల్లా జట్టు ఎంపికలు
అనంతపురం జిల్లాలో ఈనెల 14, 15వ తేదీలలో రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కడపలోని స్థానిక డీఎస్ఏ క్రీడా మైదానంలో కడప జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో హ్యాండ్ బాల్ కడప జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్నపరెడ్డి, సింధూరి, కోచ్‌లు మునాఫ్, శివ తదితరులు పాల్గొన్నారు.