News March 19, 2024
కడప జిల్లాలో నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన

ఈనెల 20, 21, 22వ తేదీల్లో ఉమ్మడి కడప జిల్లాలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆవేదనతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. 20న గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామంలో పర్యటించి తిరుమల వెళ్లనున్నారు. 21న రాత్రికి బద్వేలు నియోజకవర్గ పరిధిలోని పొరుమామిళ్ల చేరుకుని మండలంలో 22న కార్యకర్తలను పరామర్శిస్తారు.
Similar News
News April 3, 2025
కడప జిల్లాలో యూట్యూబర్స్‌పై కేసు నమోదు

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఇద్దరు యూట్యూబర్స్‌పై కేసు నమోదు అయింది. సీఐ హేమ సుందర్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శంకర్ రాజు, సత్యనారాయణ రెడ్డి అనే యూట్యూబర్స్, జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం డబ్బుల కోసం బెదిరించారని పోలీసులకు కోడూరు రేంజ్ పీఏ శ్యాంసుందర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
News April 2, 2025
కడప: వైవీయూ దూర విద్యా పీజీ ఫలితాలు విడుదల

వైవీయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యు కేషన్ పీజీ 1, 2 సెమిస్టర్ల ఫలితాలను సీడీవోఈ డైరెక్టర్ ప్రొ. కె. కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డా. ఎం. శ్రీధర్ బాబుతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ,, 1, 2వ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 08 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించామన్నారు. ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను అభినందించారు.
News April 2, 2025
ఒంటిమిట్టలో రైళ్లు నిలపాలి: ఎంపీ మిథున్ రెడ్డి

ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నిలపాలని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, భక్తుల కోసం రాయలసీమ, తిరుమల, వెంకటాద్రి, తిరుపతి–గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఒంటిమిట్టలో నిలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ మిథున్‌రెడ్డి రాసిన లేఖలో కోరారు.