News October 22, 2024
కడప జిల్లాలో పర్యటించనున్న YS జగన్
కడప జిల్లాలో మూడు రోజుల పాటు మాజీ సీఎం జగన్ పర్యటన ఖరారైంది. బుధవారం తెనాలి నుంచి బద్వేలుకు చేరుకుంటారు. అక్కడ ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకుని వీర జావాన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల చేరుకుని గురువారం, శుక్రవారం కార్యకర్తలకు జగన్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News November 8, 2024
పులివెందులకు మరో MLA వస్తారు: భూమిరెడ్డి
మాజీ CM జగన్‌పై TDP ఎమ్మెల్సీ భూమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘EVMల మీద నమ్మకం లేని జగన్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే MLC ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నారన్నారు. అభ్యర్థిని ప్రకటించి ఎందుకు వెనకడుగు వేశారని, ఎన్నికల్లో పోటీ చేయకుండా అసెంబ్లీకీ రాని జగన్ పార్టీ అవసరమా అన్నారు. పులివెందుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించని జగన్‌కి జీతమెందుకని, రాజీనామా చేస్తే పులివెందులకు మరో MLA వస్తారని అన్నారు.
News November 8, 2024
దేవుని కడపలో రేపు మేయర్ ప్రమాణం
కడపలో ప్రస్తుతం రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. నిన్న జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వేదికగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కడప మేయర్ సురేశ్ బాబుపై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి మేయర్ సహకరించారని ఆయన చేసిన ఆరోపణలు ప్రస్తుతం కడప రాజకీయంలో కలవరం రేపుతున్నాయి. దీంతో తాను ఏ తప్పు చేయలేదని రేపు ఉదయం దేవుని కడపలో ప్రమాణం చేస్తున్నట్లు మేయర్ తెలిపారు.
News November 8, 2024
అన్నమయ్య: అమ్మమ్మపై అత్యాచారం.. 34 ఏళ్లు జైలు శిక్ష
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి సద్దిగుట్టవారిపల్లెలో 2018లో తన అమ్మమ్మపై అత్యాచారం చేసి, అతి కిరాతకంగా చంపిన ఇంద్రప్రసాద్(38) అనే ముద్దాయికి 34 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ 6 వ అదనపు జడ్జ్ శాంతి గురువారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోట పురుషోత్తం వృద్ధురాలు తరపున కేసును వాదించారు. అత్యాచారం చేసినందుకు 20 ఏళ్లు, చంపినందుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించారు.