News October 22, 2024

కడప జిల్లాలో పర్యటించనున్న YS జగన్

image

కడప జిల్లాలో మూడు రోజుల పాటు మాజీ సీఎం జగన్ పర్యటన ఖరారైంది. బుధవారం తెనాలి నుంచి బద్వేలుకు చేరుకుంటారు. అక్కడ ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకుని వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల చేరుకుని గురువారం, శుక్రవారం కార్యకర్తలకు జగన్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News January 22, 2025

శోభాయాత్రకు పకడ్బందీగా బందోబస్తు: డీఎస్పీ

image

కడపలో ఈరోజు ఉదయం అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే శ్రీరాముడి కళ్యాణం శోభాయాత్రకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప సబ్ డివిజన్ పరిధిలోని 9 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లర్లకు ఎవరైనా పాల్పడిన ప్రేరేపించినా చర్యలు తప్పవన్నారు.

News January 21, 2025

కడప: వైవీయూలో పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షురూ

image

యోగివేమన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ ప్రవేశాల కౌన్సెలింగు మంగళవారం ప్రాంగణంలోని ప్రవేశాల సంచాలకుల విభాగంలో ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగునకు వైఎస్సార్ అన్నమయ్య జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సెలింగ్ కేంద్రాన్ని వీసీ ఆచార్య కె.కృష్ణారెడ్డి, ప్రధానాచార్యులు ఎస్.రఘునాథరెడ్డి పర్యవేక్షించారు. డీవోఏ డైరక్టర్‌ డా. లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి.

News January 21, 2025

రాయచోటి: బాలికపై అత్యాచారం.. ల్యాబ్ టెక్నీషియన్ అరెస్టు

image

రాయచోటిలో పోక్సో కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. HIV నివారణ మందుల కోసం ప్రతి నెల ఆసుపత్రికి వెళ్లిన బాలికను ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఏడు నెలల గర్భిణి చేసి, నర్సు సహాయంతో అబార్షన్ చేయించాడు. ఇంట్లో విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు విజయ్‌ను అరెస్టు చేశారు.