News August 1, 2024
కడప జిల్లాలో పెన్షన్ పంపిణీ @9AM

జిల్లాలో ఆగస్టు నెలకి సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఇందులో భాగంగా 2,64,014 పెన్షన్లకు గాను 2,07,306 పెన్షన్లను పంపిణీ చేసి 78.52% పూర్తి అయింది. ఉదయాన్నే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ దారుల ఇంటి దగ్గరకి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కడప జిల్లా నాల్గవ స్థానంలో కొనసాగుతోంది.
Similar News
News January 20, 2026
కడప: గుండెపోటుతోనే విజయకుమారి మృతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్

సర్వేల పేరుతో వేధించడంతోనే కడపలో సచివాలయ ఉద్యోగిని జి.విజయకుమారి చనిపోయిందని వైసీపీ ట్వీట్ చేసింది. దీనిని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ‘విజయకుమారి దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కోరిక మేరకు తన ఇంటికి సమీపంలోని సచివాలయానికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈనెల 18న గుండెపోటు రావడంతో ఆమె చనిపోయింది. ప్రభుత్వ వేధింపులతో అని తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అని ట్వీట్ చేసింది.
News January 19, 2026
కడప: చంద్రప్రభ వాహనంపై దర్శనం

దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీలక్ష్మి సమేత వేంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. చంద్రప్రభ వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు కాయాకర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
News January 19, 2026
కడప పోలీసులకు 76 ఫిర్యాదులు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధ్యక్షతన పోలీస్ అధికారులు అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. మొత్తంగా 76 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని సకాలంలో విచారణ జరిపి, పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.


