News March 29, 2025
కడప జిల్లాలో ప్రాణం తీసిన బెట్టింగ్

బెట్టింగ్ భూతానికి కడప జిల్లాలో ఓ యువకుడు బలయ్యాడు. ప్రొద్దుటూరులో పట్టణంలోని రామేశ్వరానికి చెందిన యువకుడు ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. ఏకంగా రూ.8 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. 1-టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
NOTE: ఐపీఎల్, ఆన్లైన్, ఇతర ఏ బెట్టింగ్ జోలికి వెళ్లకండి
Similar News
News January 10, 2026
గండికోటలో మొదటిరోజు షెడ్యూల్ ఇదే.!

గండికోటలో 11వ తేదీ మొదటిరోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
*సాయంత్రం 4:00 -5:30 గం.వరకు శోభాయాత్ర
*5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
*6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
*రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
*రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
*రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
*రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ
News January 10, 2026
గండికోట ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు

గండికోట ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈనెల 11, 12, 13న ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు RTC రీజనల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి శనివారం తెలిపారు. జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి మొత్తం 39 బస్సులను నడుపుతున్నామన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 10 వరకు బస్సులు తిరుగుతాయన్నారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.
News January 10, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540


