News June 7, 2024

కడప జిల్లాలో మంత్రి పదవి ఎవరికి?

image

జగన్ ఇలాకాపై TDP పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గ స్థానాల్లో ఏడింటిలో గెలిచింది. దీంతో ఇప్పుడు మంత్రి పదవి ఎవరికి దక్కుతుందా అనదే చర్చ. YCP కంచుకోటలో భారీ మెజార్టీ సాధించడంలో నేతల కృషి మరువలేనిది. పలువురు మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. మరి సామాజికవర్గాల వారిగా పరిశీలించి చంద్రబాబు కేబినేట్‌లోకి ఎవరిని చేర్చుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Similar News

News October 19, 2025

కడప: రేపు పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

News October 19, 2025

పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: అదనపు ఎస్పీ

image

పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాశ్ బాబు తెలిపారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల కుటుంబాలతో సమావేశమై, వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి, ప్రభుత్వం అందించే సౌకర్యాలపై అవగాహన కల్పించామని చెప్పారు.

News October 19, 2025

బద్వేల్ నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్ ఫోకస్

image

బద్వేల్‌పై TDP అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జ్ విషయంలో నియోజకవర్గంలోని ప్రజలకు IVRS కాల్స్ చేసి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇందులో ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రితీశ్ రెడ్డి, DCC బ్యాంక్ ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్లను పేర్కొంది. బద్వేలులో ఎవరైనా నాయకుడిగా ఎదిగారంటే అది వీరారెడ్డి కుటుంబం దయేనని, రితీశ్ రెడ్డే తమ నాయకుడు అని పలువురు TDP నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు.