News January 31, 2026

కడప జిల్లాలో మూడు ఆలయాలకు ఈవోల నియామకం

image

కడప జిల్లాలోని 3 ప్రధాన దేవాలయాలకు కొత్త ఈవోలను నియమిస్తూ శనివారం ప్రభుత్వం జారీ చేసింది. గండి ఆంజనేయస్వామి ఆలయానికి కర్నూలు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్‌ను నియమించారు. ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి కేవీ రమణ, ప్రొద్దుటూరు శ్రీకృష్ణ గీతాశ్రమానికి శ్రీధర్‌ను నియమించారు. ఈ మూడు ఆలయాలకు ఈవోగా ఉన్న వెంకటసుబ్బయ్య శనివారం పదవీ విరమణ చేస్తున్నారు.

Similar News

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

News April 20, 2026

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

image

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.