News August 2, 2024
కడప జిల్లాలో రైల్వే కవచ్
ఒకే లైనుపై రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఢీ కొనకుండా ముందస్తుగా ప్రమాదాన్ని పసిగట్టి నివారించే వ్యవస్థ కవచ్‌ను కడప జిల్లాలో అమలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు సంబంధిత సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇది కార్యరూపం దాలిస్తే ముంబై – చెన్నై మార్గంలో నాల్వార్, గుంతకల్, నందలూరు, రేణిగుంట లైనులో ఈ వ్యవస్థ అమలు కానుంది.
Similar News
News December 30, 2024
కమలాపురంలో రైలు కిందపడి మహిళ మృతి
కమలాపురంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. గుర్తుతెలియని ఓ మహిళ సెల్ఫోన్లో మాట్లాడుతూ కమలాపురం రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతుంది. ఈ క్రమంలో రైలు వచ్చి ఢీకొట్టడంతో కిందపడింది. స్థానికులు అక్కడికి చేరుకొని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 30, 2024
‘పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలి’
కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మినరల్ ఫండ్ ద్వారా నిర్మిస్తున్న వివిధ రకాల పెండింగ్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నారు.
News December 30, 2024
కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్
కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గురునాథ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్‌గా వున్న గురునాథ్ ఎస్ఐ అని చెప్పుకొంటూ ప్రజలను బెదిరించడం, సక్రమంగా విధులు నిర్వర్తించకుండా ఉండటంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వారు అందించిన నివేదిక ప్రకారం అతనిపై ఎస్పీ వేటు వేశారు