News October 13, 2024

కడప జిల్లాలో లాటరీ’ కిక్కెవరికో?

image

రాష్ట్రంలో మద్యం షాపులను సోమవారం లాటరీ ద్వారా కేటాయిస్తారు. 3396 షాపులకు వేర్వేరుగా లాటరీలు తీస్తారు. ప్రతి దరఖాస్తుదారునికి ఒక నంబరు కేటాయించి, మాన్యువల్‌గా లాటరీ తీస్తారు. దీనికోసం కడప జిల్లాల్లో 139 మద్యం దుకాణాలకు లాటరీ కోసం కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 139 మద్యం దుకాణాల కోసం 3257 దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.

Similar News

News December 5, 2025

కడపలో ఆచూకీ లేని 51వేల రేషన్ కార్డుదారులు..!

image

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్‌లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్‌లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.

News December 5, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00

News December 5, 2025

కడప రిమ్స్ సేవలు నిరాశపరుస్తున్నాయి!

image

కడప రిమ్స్ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?’ అంటూ Way2Newsలో పబ్లిష్ అయిన <<18460527>>వార్తకు<<>> భారీ స్పందన లభించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రెఫరెన్స్‌తో సేవలు త్వరగా అందుతాయని, కొన్ని సేవలకు లంచం ఇవ్వాలని, కొందరు వైద్యులు, నర్సులు కఠినంగా మాట్లాడతారని కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులో సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.