News August 13, 2024
కడప జిల్లాలో సీఐల బదిలీలు

కడప జిల్లాలో సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు రేంజ్ పరిధిలో దాదాపు 62 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించిన సీఐలను బదిలీ చేస్తూ.. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. పోస్టింగ్ ఇవ్వగా, పలువురిని వీఆర్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
Similar News
News December 24, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో బుధవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,050
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,926
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2,240
News December 24, 2025
పులివెందులలో ఇవాళ జగన్ పర్యటన వివరాలు

మాజీ సీఎం జగన్ ఇవాళ్టి పర్యటన వివరాలను వైసీపీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఉదయం 9:30కు పులివెందుల నుంచి బయలుదేరి 10:30కి ఇడుపులపాయ ప్రార్థనా మందిరానికి చేరుకుంటారు. అక్కడ 1:00 గంట వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2 గంటలకు పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకొని రాత్రి 7 గంటల వరకు ప్రజలను కలుస్తారు. అనంతరం నివాసానికి వెళతారు.
News December 24, 2025
మాజీ సీఎం జగన్ను కలిసిన జిల్లా ముఖ్య నాయకులు

మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. పులివెందులలోని ఆయన నివాసంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ నాయకులకు సూచించారు.


