News August 27, 2024

కడప జిల్లాలో సులభతరంగా ఇసుక సరఫరా.!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జేసీ అదితి సింగ్‌తో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.

Similar News

News March 9, 2026

పొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరి మృతి.!

image

పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి పోలీసులు సోమవారం తెలిపారు. అనసూయ (60), ఓబులేసు(58) మృతి చెందారని అన్నారు. వీరి సంబంధీకులు ఎవరైనా ఉంటే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ (9490387344, 9154666607) నంబర్లను సంప్రదించాలన్నారు.

News March 9, 2026

బి.మఠం: అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డా సేఫ్

image

అంబులెన్స్‌లో మహిళ ప్రసవించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. బి.మఠం మండలం పలుగురాళ్లపల్లికి చెందిన గర్భిణి అపర్ణను పోరుమామిళ్ల నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే అపర్ణ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహాలక్ష్మి, పైలట్ వెంకటేశ్వర్లు తెలిపారు. అంబులెన్స్ సిబ్బందిని పలువురు అభినందించారు.

News March 9, 2026

VRకు కడప జిల్లా కానిస్టేబుల్.!

image

కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిషోర్‌ను VRకు పంపినట్లు SI సుహాన్ తెలిపారు. కిషోర్ కలసపాడు PSలో కోర్ట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులపట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో విఆర్‌కు పంపినట్లు కలసపాడు ఎస్సై వివరించారు.