News October 12, 2024
కడప జిల్లాలో 139 దుకాణాలకు 3,235 దరఖాస్తులు

కడప జిల్లా వ్యాప్తంగా 139 నూతన ప్రైవేటు మద్యం దుకాణాలకు 3,235 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.64.70 కోట్ల ఆదాయం వచ్చింది. ధరఖాస్తుల ఆదారంగా ఈనెల 14న లాటరీ విదానం ద్వారా కడప కలెక్టర్ శివశంకర్ ఆద్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరగనుంది. 16 నుంచి షాపుల నిర్వహన కొనసాగనుంది.
Similar News
News September 19, 2025
చింతకుంటలో ఎరువుల పంపిణీని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్

దువ్వూరు మండలం చింతకుంటలోని రైతు సేవా కేంద్రంలో గురువారం జరిగిన యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్ పరిశీలించారు. రైతులు యూరియా వినియోగాన్ని క్రమేనా తగ్గించాలని, దీని స్థానంలో నానో యూనియన్ వాడాలని సూచించారు. ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News September 18, 2025
కడప: జాతీయ ప్రతిభా ఉపకార వేతన దరఖాస్తుకు అవకాశం

కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతన పథకo ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని, దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30న చివరి గడువని డీఈవో శంషుద్దీన్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులలు పరీక్ష ఫీజు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 17, 2025
తిరుమలలో పులివెందుల వాసి మృతి

తిరుమలలో బుధవారం శ్రీవారి భక్తుడు మృతి చెందాడు. టీటీడీ అధికారుల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల తాలూకా పార్నపల్లికి చెందిన శ్రీవారి భక్తుడు తిరుమల అద్దె గదుల ప్రాంతంలోని ఓ బాత్రూంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు అతను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.