News August 5, 2024

కడప జిల్లాలో 2,200 పాఠశాలల్లో ఎన్నికలు

image

కడప జిల్లాలో 2,200 ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీల ఎన్నికలతో పాత కమిటీల కాలపరిమితి ముగిసింది. దీంతో రెండేళ్ల కాలపరిమితితో కొత్త కమిటీల నియామకం చేపట్టనున్నారు. ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులే ఓటర్లుగా ఉంటారు. ఈనెల 8 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. పాఠశాలలను అభివృద్ధి చేసేవారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

Similar News

News December 7, 2025

పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

image

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

ప్రొద్దుటూరు: రూ.10 లక్షల పెనాల్టీ.!

image

ప్రొద్దుటూరులో జరుగుతున్న స్మగ్లింగ్ వ్యాపారంపై జీఎస్టీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్, కొరియర్ కార్యాలయాలు వందకుపైగా ఉన్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ పెద్ద మొత్తంలో బంగారం, బట్టలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మందులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. వీటిపై అధికారులు నిఘా పెట్టారు. శుక్రవారం దాడులు చేసి ఒక్క రోజులోనే రూ.10 లక్షలు పైగా పెనాల్టీ వసూలు చేశారు.