News March 29, 2024
కడప జిల్లాలో 26 ఓట్లతో గెలిచిన MLA ఎవరో తెలుసా?

మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి రామారెడ్డి 11 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈ నియోజకవర్గానికి ఐదుగురు మాత్రమే MLAలుగా ప్రాతినిధ్యం వహించగా, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి డీఎల్ రవీంద్రరెడ్డి కేవలం 26 ఓట్ల తేడాతో రఘురామిరెడ్డి (TDP)పై గెలుపొందారు. దీంతో జిల్లాలో తక్కువ ఓట్లతో ఓడిన, గెలిచిన వ్యక్తులుగా నిలిచారు.
Similar News
News January 9, 2026
20 సూత్రాల సమావేశానికి ప్రొద్దుటూరు MLA ఒక్కరే.!

కడపలోని 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్ అధ్యక్షతన శుక్రవారం కడపలో అభివృద్ధి సమావేశం జరిగింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కీలకమైన ఈ సమావేశానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఒక్కరే హాజరయ్యారు. తన నియోజకవర్గంలోని సమస్యలపై ఆయన సమావేశంలో లేవనెత్తారు. వైసీపీ, జనసేనకు MLAలు ఉన్నా, వారెవ్వరూ సమావేశానికి హాజరుకాలేదు.
News January 9, 2026
కడప: సీట్లో కూర్చోకముందే ఆ SIలకు మళ్లీ ట్రాన్స్ఫర్

మూడు రోజులక్రితం కడప జిల్లాలో 18 మంది SIలు ట్రాన్స్ఫర్ అయిన విషయం తెలిసిందే. వారు బదిలీ అయిన స్టేషన్లో రిపోర్ట్ చేయకమునుపే వారిలో కొందరిని మళ్లీ బదిలీ చేశారు. మొదట ప్రొద్దుటూరు రూరల్ స్టేషన్ SIగా అరుణ్‌రెడ్డిని మైదుకూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన అక్కడ సీట్లో కూర్చోకమునుపే కడప వీఆర్‌కి బదిలీ అయ్యారు. బద్వేల్ నుంచి శ్రీకాంత్‌ను మొదట ప్రొద్దుటూరు 1-టౌన్, ఇప్పుడు రూరల్‌కు బదిలీ చేశారు.
News January 9, 2026
గండికోట ఉత్సవాలు.. నేడు కడపలో బైక్ ర్యాలీ

గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. రాజీవ్ మార్క్ సర్కిల్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్, ఎర్రముక్కపల్లి సర్కిల్, ఐటీఐ బిల్ట్ సర్కిల్, వినాయక నగర్ సర్కిల్, అల్మాస్పేట్ మాసాపేట సర్కిల్, అన్నమయ్య సర్కిల్, అప్సర హాల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జరుగుతుంది.


