News November 20, 2024
కడప జిల్లాలో SCల కోసం మంత్రి హమీ

Scలను YCP మోసం చేసిందని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘SCల అభివృద్ధి కోసం 2018 లో సబ్సిడీ కింద రూ.25 కోట్లను వెహికల్స్ కోసం మంజూరు చేస్తే.. వైసీపీ నాయకుల నిర్లక్ష్యంతో అవి దొంగలపాలయ్యాయన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని అని మంత్రి స్వామిని కోరారు. వాహనాలను పంపిణీ చేసేందుకు కమిటీ నియమిస్తామని , నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Similar News
News March 14, 2026
కడప: 2 వారాల గడువు..రూ.97 కోట్లే లక్ష్యం.!

జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.97.17 కోట్లు పేరుకు పోయాయి. 2 వారాల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పన్ను వసూళ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల వారీగా బకాయిలు ఇలా (రూ.కోట్లలో) ఉన్నాయి. *KDP – రూ.62.93 *PDTR – రూ.20.14 *PLVD – రూ.4.58 *జమ్మలమడుగు – రూ.2.49
*ఎర్రగుంట్ల – రూ.3.20 *మైదుకూరు – రూ.3.09 *కమలాపురం – రూ.0.74కోట్లు.
News March 14, 2026
అదనపు ఛార్జీలు తీసుకుంటే చర్యలు: RDO

జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజన్ అధికారి భవన అన్నారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. LPG పంపిణి సంస్థలు తప్పనిసరిగా స్టాక్ బోర్డును ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్ సరఫరా చేయాలన్నారు. అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.
News March 14, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో శనివారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ సివిక్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 91% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేడు 3,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 3,397 మంది మాత్రమే హాజరయ్యారు. 326 మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు.


