News September 20, 2024
కడప జిల్లా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికను రూపొందించండి

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికను రూపొందించుకుని, వాటి లక్ష్య సాధనకు పటిష్ఠమైన కార్యాచరణ సిద్ధం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరాబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. జిల్లాను అభివృద్ధిపథంలో నడిపించాలని చెప్పారు.
Similar News
News November 1, 2025
కడప: హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను ఎస్పీ నచికేత్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడపలోని స్టేట్ గెస్ట్ హౌస్లో వారు కలుసుకున్నారు. జిల్లాలో శాంతిభద్రతల విషయం గురించి ఎస్పీ వివరించారు. జిల్లాలో శాంతిభద్రతల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.
News November 1, 2025
హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలు..!

ప్రొద్దుటూరు హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రొద్దుటూరు హౌసింగ్ కాలనీల్లో రూ.1,25,16,285ల విలువైన 13678.92MTల బల్క్ శాండ్ దుర్వినియోగమైనట్లు పలువురు ఆరోపించారు. AE వెంకటేశ్వర్లు, WI గుర్రప్ప, ఇందిర, కుమారిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు వివరాలు కోరుతూ.. DEE నుంచి ప్రొద్దుటూరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 1, 2025
ప్రొద్దుటూరు హౌస్ బిల్డింగ్ సొసైటీపై DLCO విచారణ..!

ప్రొద్దుటూరు హౌస్ బిల్డింగ్ సొసైటీ పాలకవర్గం చర్యలపై DLCO సత్యానంద్ శనివారం విచారణ చేపట్టారు. సొసైటీ పాలకవర్గం, సబ్ రిజిస్ట్రార్ కలిసి NOC లెటర్ పేరుతో సాగించిన అన్యాయాలపై దుమారం చెలరేగడంతో DLCO విచారణ చేపట్టారు. సొసైటీ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి విష్ణులను DLCO తన కార్యాలయానికి పిలిపించి NOCలపై విచారించారు. సంబంధిత రికార్డులను తెప్పించుకొని, NOC లెటర్ల చట్టబద్ధతపై విచారిస్తున్నారు.


