News October 17, 2024
కడప జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా అదితి సింగ్
కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్‌ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించడంతో ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గాజాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాడర్ ఆదేశాల మేరకు బుధవారం తెలంగాణ సెక్రటేరియట్ లోతేటి శివశంకర్ రిపోర్ట్ చేయడంతో జిల్లాలో కలెక్టర్ పోస్టు ఖాళీ ఏర్పడింది. కొత్త కలెక్టర్‌ను నియమించేంత వరకూ జేసీనే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Similar News
News January 21, 2025
సిద్దవటం: కిడ్నీ వ్యాధితో ఏడేళ్ల బాలుడి మృతి
కడప జిల్లా సిద్దవటం మండలంలోని రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన రాజు, రామతులసి దంపతుల కుమారుడు మహేంద్రవర్మ(7) మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రామక్రిష్ణాపురానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ఎంపీపీ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నాడు. అయితే ఎప్పటి నుంచో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నేటి ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
News January 21, 2025
కడప: నేటి నుంచి YVU పీజీ పరీక్షలు
కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ అనుబంధ కళాశాలల MA, M.Com, M.Sc& M.P.Ed. మొదటి సెమిస్టర్ పీజీ పరీక్షలు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలు 21, 23, 25, 27, 29, 31 తేదీలలో ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
News January 21, 2025
కడప: హత్యాయత్నం కేసులో 12 మందికి జైలు శిక్ష
వీరపునాయునిపల్లె మండలంలో 2014లో గుమ్మిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 12 మందిపై నేరం రుజువైంది. దీంతో ప్రొద్దుటూరు కోర్టు ముద్దాయిలకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అప్పటి ఎస్ఐ రోషన్ కేసు నమోదు చేయగా.. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.