News November 13, 2024

కడప జిల్లా ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం

image

రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్ విప్‌తోపాటు శాసనసభ, మండలి విప్‌లుగా 15 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డిని శాసనసభ విప్‌గా నియమించారు. అయితే TDP నుంచి 15 మందికి, జనసేనలో నలుగురికి చోటు దక్కింది. కాగా BJP నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి మాత్రమే నిలిచారు. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Similar News

News December 7, 2024

కడపలో Pic Of The Day

image

పేరెంట్- టీచర్స్ మీటింగ్‌లో పాల్గొనేందుకు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పోలీస్ సెక్యూరిటీ స్నిఫర్ డాగ్ ‘లూసి’ గౌరవ వందనం చేసింది. ఆయన దానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఆకట్టుకుంటోంది. కాగా ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రావీణ్యం పొందింది.

News December 7, 2024

కడప జిల్లాలో వరుస హత్యలు

image

కడప జిల్లాలో వారం వ్యవధిలో 4 హత్యలు జరిగాయి. నవంబర్ 30వతేదీన పులివెందులలో కొడుకును తండ్రి హత మార్చాడు. డిసెంబర్ 2న ప్రొద్దుటూరులో రౌడీషీటర్, అదే రోజు దువ్వూరులో మద్యానికి బానిసై వేధిస్తున్న కుమారుడిని తండ్రి రోకలిబండతో చంపాడు. నిన్న చక్రాయపేట మండలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరు కన్నుమూశారు. ఈ వరస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

News December 7, 2024

పెండ్లిమర్రి: గోపరాజుపల్లిలో ఇరువర్గాల దాడి

image

ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన పెండ్లిమర్రి మండలంలోని గోపరాజుపల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే ఇరువర్గాల మధ్య గొడవ జరిగి నంద్యాల సుబ్బయ్య అనే యువకుడి మీద దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గొడవకు పాతకక్షలే కారణమని వారు తెలిపారు.