News February 12, 2025

కడప జిల్లా ఎస్పీని కలిసిన మహిళా పోలీసులు

image

కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఈజీ అశోక్ కుమార్‌ను జిల్లా మహిళా పోలీసుల అసోసియేషన్ మంగళవారం కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో కలిశారు. నూతనంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కలిశామన్నారు. అనంతరం మహిళా పోలీసుల సంక్షేమానికి కృషి చేయాలని ఎస్పీని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కే వసంత లక్ష్మి, జిల్లా ప్రెసిడెంట్ ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 22, 2025

కడప: ‘వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడు’

image

కడప జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడని టీడీపీ నేత ఆలూరి నరసింహులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తమాధవరం మాజీ సర్పంచ్ ఫేక్ డాక్యుమెంట్లతో రూ.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి, అక్కడ హోటల్ కడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో, అలాగే మంత్రిని కలిసి ఫిర్యాదు చేశాడు.

News March 22, 2025

కడప: అయ్యో.. ఈమె కష్టం ఎవరికీ రాకూడదు

image

కడప జిల్లా ముద్దనూరు(M)లో ఓ మహిళ గాథ కన్నీటిని తెప్పిస్తోంది. మండలంలోని ఉప్పలూరుకు చెందిన గోవిందు శ్యామల భర్త లక్ష్మయ్యను ఏడాది క్రితం పాము కాటు వల్ల కోల్పోయింది. ఈమెకు ఇద్దరు ఆడ సంతానం. కుటుంబ పోషణ కోసం స్కూల్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. శుక్రవారం తన చిన్న కుమార్తె కీర్తన(6) కారు ప్రమాదంలో మృతి చెందింది. ఆమెను చూసిన గ్రామస్థులు అయ్యో దేవుడా ఎంతా పని చేశావని కన్నీటి పర్యంతం అయ్యారు.

News March 22, 2025

కడప: ఈ-కేవైసీ చేస్తేనే రేషన్ సరుకులు

image

ఈనెల 31వ తేదీ లోపు రేషన్ కార్డులు ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి జె.శిరీష తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల్లో పెండింగ్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీ నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఏప్రిల్ నెల నిత్యావసర సరుకులు అందుతాయని తెలిపారు. సమీపంలోని చౌక దుకాణం /సచివాలయంలో వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు.

error: Content is protected !!