News November 6, 2024

కడప జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్

image

కడప జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడున్న కలెక్టర్ శివ శంకర్ తెలంగాణ క్యాడర్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో శ్రీధర్ బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో వైఎస్సార్ జిల్లాను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Similar News

News December 2, 2024

ప్రొద్దుటూరు: లాడ్జీలో దారుణ హత్య

image

ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జీలో సోమవారం ఉదయం దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేసి ఉండచ్చని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతునికి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 2, 2024

కడప: నేడు జరగాల్సిన వైవీయూ డిగ్రీ పరీక్ష వాయిదా

image

వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సోమవారం జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను రద్దు చేసినట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రద్దయిన పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత తెలియజేస్తామన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నేడు జరగాల్సిన పరీక్షలు మాత్రమే రద్దు చేశామన్నారు.

News December 2, 2024

కడప: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని (గ్రీవెన్సు) తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.