News April 18, 2025
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వేంపల్లి చెందిన సుబ్రహ్మణ్యంను పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు నియామక ధ్రువపత్రాన్ని ఆయనకు మాజీ ఎంపీ తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు సూచించారు.
Similar News
News April 20, 2025
ఎమ్మెస్ రామారావును కడప జిల్లా వాసులు మరచిపోలేరు

ఎమ్మెస్ రామారావు నేపథ్య గాయకుడు మన మధ్య లేకపోయినా కడప జిల్లా వాసులు మరచిపోలేరు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కలదు, రామాయణ భాగం, సుందరకాండ, హనుమాన్ చాలీసా మంచి గుర్తింపు ఖ్యాతి తెచ్చి పెట్టాయి. గతంలో ఆకాశవాణి కడప రేడియో కేంద్రంలో ప్రతిరోజు ఉదయం పూట సుందరకాండ పారాయణం పాట ప్రసారం చేసేవారు. దానితో ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండేది. నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి.
News April 20, 2025
గోసేవ మహా పుణ్యకార్యం: కడప కలెక్టర్

మైదుకూరు నియోజకవర్గం చల్ల బసాయిపల్లి సమీపంలోని శ్రీ గోపాలకృష్ణ సేవాసమితి ముక్తిధామం గోశాలను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ సందర్శించారు. గోవుల పోషణ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గోసేవ మహా పుణ్య కార్యమని ఆయన నిర్వాహకులను ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, ఆర్డీవో సాయిశ్రీ పాల్గొన్నారు.
News April 19, 2025
కడపలో పోలీసుల శ్రమదానం

నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే పోలీసులు చీపుర చేతబట్టి చెత్త ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.