News July 11, 2024
కడప జిల్లా జనాభా ఎంతంటే?

నేడు అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యయన కేంద్ర గ్రోత్ రేట్ ఆధారంగా జనాభా గణాంకాలను విడుదల చేశారు. దీని ప్రకారం ప్రస్తుతం కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 20,60,654 జనాభా ఉన్నట్లు తెలిపారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో 28,84,524 మంది ఉన్నారు. కాగా ఈఏడాది జిల్లాలో భారీగా జనాభా పెరిగిందని తెలిపారు.
Similar News
News December 16, 2025
కడప జిల్లాలో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

కడప జిల్లాలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు హెటిరో సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలోని కొండాపురం మండలం టి.కోడూరులో 30 ఎకరాలు, చామలూరు గ్రామంలో 10 ఎకరాలు, కొప్పోలులో 5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షలు లీజు ప్రాతిపాదికన భూములు కేటాయించారు.
News December 15, 2025
కడప: డాక్టరేట్ అందుకున్న అధ్యాపకుడు

కడప డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన యానిమేషన్ విభాగం అధ్యాపకుడు డా.ఉండేల శివకృష్ణా రెడ్డి డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య బి.జయరామిరెడ్డి పట్టా అందజేసి అభినందించారు.
News December 15, 2025
దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

దువ్వూరులోని మురళి నగర్ మెట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సొంత పనులు కోసం నడుచుకుంటూ వెళుతున్న వీర ప్రతాపరెడ్డి, ఎల్లయ్య అనే వ్యక్తులను ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లయ్యది నేలటూరు కాగా, వీర ప్రతాప్ రెడ్డిది గోపులాపురంగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు


