News January 20, 2025
కడప జిల్లా డీఈవోగా షంషుద్దీన్

కడప జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా కర్నూలు జిల్లా తాండ్రపాడు డైట్ సీనియర్ లెక్చరర్ ఎస్. షంషుద్దీన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా వ్యవహరించిన మీనాక్షిపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆరోపణలు, ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో ఈయనను పాఠశాల విద్య ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 18, 2025
కడప: జిల్లా వ్యాప్తంగా పోలీసుల పల్లెనిద్ర

కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా ప్రతి ఒక్కరు సహకరించాలని, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు ఉంటాయన్నారు
News February 18, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

నందలూరులో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకకు చెందిన టీడీపీ నేత కొమ్మినేని ప్రసాద్ (46) గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు, క్షత్రియ సంఘం రాష్ట్ర డైరెక్టర్ ప్రతాప్ రాజు మంచి కార్యకర్తను కోల్పోయామన్నారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
News February 18, 2025
ముద్దనూరులో రోడ్డు ప్రమాదం

ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కడప నుంచి గండికోట వెళ్తుండగా ఇన్నోవా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.