News September 3, 2024
కడప జిల్లా పోలీసు శాఖలో భారీగా బదిలీలు
కడప జిల్లా పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న 261 పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 44 మంది ఏఎస్సైలు, 91 హెడ్ కానిస్టేబుల్, 124 మంది కానిస్టేబుల్స్‌ను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత స్టేషన్‌లలో రిపోర్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు.
Similar News
News September 12, 2024
దేవుని కడపలో ఈ నెల 15 నుంచి ఉత్సవాలు
తిరుమలకు తొలిగడపగా పేరున్న దేవునికడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి దోష పరిహార ఉత్సవాలు జరగనున్నాయి. ఏడాది పాటు ఆలయంలో పఠనోత్సవాలు సందర్భంగా జరిగిన దోషాల పరిహారం కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 15న తొలి రోజున ఆదివారం అంకురార్పణ, పవిత్రాల ప్రతిష్ఠ, 16న సమర్పణ, 17న ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
News September 12, 2024
సైకో ఐడియాలు జగన్‌కే వస్తాయి: బీటెక్ రవి
గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు ప్రకాశం బ్యారేజీ వద్ద బోటును అడ్డువేశారు. ఇప్పుడు ఏకంగా బ్యారేజీనే పగలకొట్టడానికి YS జగన్ ప్రయత్నించాడని బీటెక్ రవి X వేదికగా ఆరోపించారు. ఇటువంటి సైకో ఐడియాలు జగన్‌కే వస్తాయని విమర్శించారు. ‘బ్యారేజీని ఢీకొట్టిన మూడు పడవలు YCP నేతలవి కావడం ఒక రుజువు అయితే.. గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు జగన్ ఇలాగే బోటును అడ్డు వేయించాడు.’ అని పోస్ట్ చేశారు.
News September 12, 2024
గణేశ్ మండపంలోకి చెప్పులతో మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే ఆంజాద్ బాషా చెప్పులు వేసుకుని గణేశ్ మండపంలో వినాయకుడి విగ్రహం ముందు ఫొటోలు దిగడం కడప నగరంలో కలకలం రేపింది. ఆయన కడప మేయర్ సురేశ్ బాబుతో కలిసి మంగళవారం 25వ డివిజన్ రాధాకృష్ణనగర్‌లోని గణేశ్ మండపానికి వచ్చారు. పూజల అనంతరం అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణ, వైసీపీ నాయకులతో కలిసి చెప్పులు వేసుకుని ఫొటోలు దిగారు. దీనిపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.