News October 19, 2024
కడప జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ ఇతనే.!

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కడప, కర్నూల్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని అన్నారు. 2029లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలన్నారు.
Similar News
News October 18, 2025
అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేయరాదు: ఎస్పీ

పోలీసుల అనుమతి లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో బాణాసంచా నిలువలు కానీ బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయరాదని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే టపాసుల విక్రయాలు చేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 17, 2025

కడప: బిడ్డకు జన్మనిచ్చిన 16 ఏళ్ల బాలిక

ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలంలో వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన చెంచయ్యగారి ప్రసాద్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే ఊరికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. చంపుతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు గర్భం రావడంతో అబార్షన్ చేయించాలని ప్రయత్నించాడు. ఈక్రమంలో జులైలో నిందితుడిపై పోక్సో కేసు కింద నమోదు చేశారు. ఆ బాలిక ఇవాళ తెల్లవారుజామున బిడ్డకు జన్మనిచ్చింది.