News September 15, 2024

కడప జిల్లా వాసులకు GOOD NEWS

image

కడప జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశం గండికోటలో నగరవనం, మైలవరం జలాశయంలో బోటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఈ మేరకు గండికోటలో ఏర్పాటు చేయబోయే నగరవనం స్థల పరిశీలనతోపాటు.. మైలవరం జలాశయంలో బోటింగ్‌ను శనివారం ఆయన పరశీలించారు. బోట్ ఎక్కి ఎంత దూరం ప్రజలను సౌకర్యవంతంగా తిప్పగలరు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు.

Similar News

News October 3, 2024

పెండ్లిమర్రి: పిడుగు పడి ముగ్గురు మృతి

image

పెండ్లిమర్రి మండలంలో గురువారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మండలంలోని తుమ్మలూరు పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిడుగుపాటు గురై ఓ మహిళ, ఓ అబ్బాయి మరణించారు. అలాగే పగడాలపల్లికి చెందిన మరో యువకుడు ఇసుక తోలుకోవడానికి వెళ్లి మరణించారు. సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News October 3, 2024

కడప: భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ

image

కడప జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు జిల్లా పోలీసులు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా బాధితులకు మొబైల్స్‌ను అందజేశారు. దాదాపు రూ.1.8 కోట్ల విలువగల 555 మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందించారు. ఆపరేషన్ మొబైల్ షీల్డ్ ప్రత్యేక డ్రైవ్ లో సైబర్ క్రైమ్ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న మొబైల్స్‌ను కనుగొన్నారు.

News October 3, 2024

కడపలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

కడపలోని కాగితాలపెంట ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ఏడీ కె.రత్నబాబు తెలిపారు. ఈనెల 4న ఉదయం 10 గంటలతు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ICICI బ్యాంకు, అభి గ్రీన్ టెక్నాలజీ, రిలయన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలన్నారు.