News February 21, 2025
కడప: జిల్లా వ్యాప్తంగా పోలీసుల పల్లెనిద్ర..

కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామాలకు వెళ్లి గస్తీ నిర్వహించి ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News March 26, 2025
మాజీ సీఎం జగన్ దృష్టికి జ్యోతి క్షేత్రం సమస్య

కాశినాయన జ్యోతి క్షేత్రానికి అటవీ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. విజయవాడ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి కలిసి ఇటీవల జరిగిన కాశినాయన ఆలయ నిర్మాణాలను కూల్చివేత ఘటన గురించి జగన్మోహన్ రెడ్డికి వివరించారు.
News March 26, 2025
ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితా విడుదల

ఉచిత డీఎస్సీ కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల జాబితాను https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో ఉంచినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి కె. సరస్వతి తెలిపారు. షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీ లేదా అంతకుముందు వెబ్ ఆప్షన్ సర్వీస్ ద్వారా ఎంప్యానల్ కోచింగ్ సంస్థలకు తమ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవాలని కోరారు. ఫెజ్-1 ఎంపికలకు ఎడిట్ ఆప్షన్ లేదన్నారు.
News March 26, 2025
ఎర్రగుంట్ల: తల్లిదండ్రులు మృతి.. అనాథలైన పిల్లలు

ఎర్రగుంట్ల (M) కలమలలో భార్యాభర్తలైన రాజారెడ్డి(45) సుజాత(35)ను నిన్న వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. రాజారెడ్డికి ఇద్దరు అమ్మాయిలు. ఎర్రగుంట్లలో ఆర్టీపీపీలో కార్మికుడిగా పనిచేస్తూ వారిని చదివిస్తున్నాడు. పెద్దమ్మాయి బీటెక్ చదువుండగా, చిన్నకుమార్తె ఇంటర్ చదువుతోంది. దీంతో వారు అనాథలయ్యారని గ్రామస్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ రూ.4 లక్షలు ఇచ్చారు.