News September 9, 2024
కడప జిల్లా వ్యాప్తంగా వర్షపాత వివరాలు

అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. లింగాల మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ వర్షం నమోదయినట్లు చెప్పారు. కొండాపురం మండలంలో 1.2 మి.మీ, పులివెందుల 26, వేముల 15, చక్రాయపేట 4, సింహాద్రిపురం 4.4, వేంపల్లిలో 5.4, మైదుకూరు 3.8, ఖాజీపేట 2.8, చాపాడు 2.4, తొండూరు 2.0, సిద్దవటం 1.8, దువ్వూరు 1.6, బద్వేల్, అట్లూరు 1.4, బీ.కోడూరు 1.0, బీ.మఠం మండలంలో 1.2 మి.మీ వర్షం కురిసిందన్నారు.
Similar News
News December 20, 2025
ఖాకీ చొక్కా ధరించిన కడప బిడ్డలు..!

కడప జిల్లా వ్యాప్తంగా 110 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. కడప నియోజకవర్గానికి చెందిన 13 మంది యువత కానిస్టేబుల్లుగా ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే మాధవి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కష్టపడి చదివి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించిన యువత జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
News December 20, 2025
అన్నమయ్య: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నం

అభం, శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితులు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. మండలానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. అవ్వ చెంతనే ఉంటోంది. అవ్వ కూలి పనులు చేసుకుంటూ పాపను పోషించుకుంటూ చదివిస్తోంది. బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.
News December 19, 2025
కడప: ట్రాక్టర్ చక్రాల కిందపడి వ్యక్తి మృతి

ట్రాక్టర్‌పై నుంచి కింద పడి అదే వాహన చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజుపాలెం మండలం వెలవలి సాయిబాబా దేవాలయం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నాగరాజు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం వేళ అతను కూలి పనులకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.


