News October 15, 2024

కడప జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్

image

విద్యుత్‌ సమస్యలపై నిరంతరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సూపరింటెండెంట్ రమణ పేర్కొన్నారు. వర్షం సమయంలో సమస్యలు తలెత్తితే కంట్రోల్‌ రూమ్‌‌కి కాల్‌ చేయాలన్నారు.
▶ కడప కంట్రోల్‌ రూమ్‌ 9440817440
▶ కడప డివిజన్‌ 9440817441
▶ పులివెందుల 9491431255
▶ ప్రొద్దుటూరు డివిజన్‌ 7893261958
▶జమ్మలమడుగు కంట్రోల్‌ రూమ్‌ 80742 69513
▶మైదుకూరు డివిజన్‌ 9492873325, 80742 69513 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

Similar News

News September 18, 2025

కడప: జాతీయ ప్రతిభా ఉపకార వేతన దరఖాస్తుకు అవకాశం

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతన పథకo ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని, దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30న చివరి గడువని డీఈవో శంషుద్దీన్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులలు పరీక్ష ఫీజు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 17, 2025

తిరుమలలో పులివెందుల వాసి మృతి

image

తిరుమలలో బుధవారం శ్రీవారి భక్తుడు మృతి చెందాడు. టీటీడీ అధికారుల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల తాలూకా పార్నపల్లికి చెందిన శ్రీవారి భక్తుడు తిరుమల అద్దె గదుల ప్రాంతంలోని ఓ బాత్రూంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు అతను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2025

కడప జిల్లా వృద్ధేలక్ష్యం: కలెక్టర్ శ్రీధర్

image

ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే జిల్లాలో మంచి వృద్ధి సాధించామని, రాష్ట్ర స్థూలోత్పత్తిలో 17.33% వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామని జిల్లా కడప కలెక్టర్ శ్రీధర్ CM సమావేశంలో వివరించారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నాలుగవ జిల్లా కలెక్టర్ల సదస్సులో కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు.