News August 4, 2024

కడప జిల్లా TODAY TOP NEWS

image

✎దువ్వూరులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
✎మైదుకూరులో ‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున విషాదం
✎కడపలో ఇంటికి కన్నం వేసి.. రూ.లక్ష స్వాహా
✎బద్వేలు: తల్లిని చేసి కువైట్‌కు జారుకున్న వ్యక్తి
✎పెండ్లిమర్రి: కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
✎అన్నమయ్య: బాలికపై అత్యాచారం
✎ నందలూరు: అడవిలో తప్పిపోయిన వ్యక్తి సేఫ్
✎ ఒంటిమిట్టలో మహిళపై దాడి
✎: ఎర్రగుంట్ల: కొడుకు అప్పులతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Similar News

News December 11, 2025

యురేనియం బాధితులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

image

తుమ్మలపల్లి యురేనియం గ్రామాల సమస్యలపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం సమీక్షించారు. కేకే కొట్టాల భూసేకరణకు ల్యాండ్ కమిటీ వేసి నోటిఫికేషన్ ఇస్తామని, ఇందుకు 6 నెలలు పడుతుందని తెలిపారు. పెండింగ్ ఉద్యోగాలు, పరిహారం వెంటనే క్లియర్ చేయాలని UCIL అధికారులను ఆదేశించారు. బాధితులకు సీఎస్ఆర్ ద్వారా వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్సీ బి.టెక్ రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.

News December 10, 2025

కడప నగర నూతన YCP మేయర్ ఇతనే.!

image

కడప నగర నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కడపలోని MP నివాసంలో జరిగిన సమావేశంలో YS అవినాశ్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్ పేరును వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News December 10, 2025

కానిస్టేబుల్ శిక్షణ ఏర్పాట్లు పరిశీలించిన కడప SP

image

ఇటీవల నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్స్‌కు త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కడప నగర శివారులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎస్పీ నచికేత్ పరిశీలించారు. అక్కడ శిక్షణ కేంద్రంలోని తరగతి గదులు, మైదానం, కిచెన్ తదితరాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.