News July 11, 2024
కడప: జీవిత ఖైదీల విడుదలకు ప్రతిపాదనలు
సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు జిల్లా అధికారులు ప్రతిపాదనలను పంపారు. ఇందులో భాగంగా కడప కేంద్ర కారాగారం నుంచి 2023లో 11 మంది, 2024లో ఐదుగురు, తాజాగా నలుగురు ఖైదీలను కలిపి మొత్తం 20 మంది పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర జైల్ల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల విడుదలపై కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Similar News
News January 27, 2025
కడప: గణతంత్ర వేడుకల్లో బహుమతులు వచ్చింది వీటికే
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు గెలుపొందిన శకటాల వివరాలు. మొదటి బహుమతిగా డీపీవో, జడ్పీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, జిల్లా నీటి యాజమాన్య సంస్థలకు లభించింది. రెండవ బహుమతిగా వ్యవసాయం, మత్య్స శాఖ, పశు సంవర్థక శాఖలకు లభించింది. మూడవ బహుమతిగా కడప మున్సిపల్ కార్పోరేషన్‌కు లభించింది. 4వది ప్రోత్సహక బహుమతిగా సీపీవో, డీఆర్డీఏ, హౌసింగ్, ఎల్డీఎం, ఎస్బీఐలకు లభించింది.
News January 26, 2025
కడప: చాక్ పీస్‌పై జాతీయ జెండా
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప నగరానికి చెందిన ఓ యువకుడు తన ప్రతిభను చాటాడు. చాక్ పీస్‌పై జాతీయ జెండాను రూపొందించి తనలో ఉన్న ప్రతిభను చాటి చెప్పాడు. కడప నగరం చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన సాయి చరణ్ క్యూబిక్‌లో ప్రతిభతో పాటు పెన్సిల్, చాక్ పీస్‌పై వివిధ రకాల ఆర్ట్ వేస్తూ అబ్బుర పరుస్తూ ఉంటాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాక్ పీస్‌పై ఆర్ట్ వేయడంతో పలువురు అభినందిస్తున్నారు.
News January 26, 2025
కడపలో ఫ్లెక్సీ వార్
కడపలో ఫ్లెక్సీ వార్ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల పోరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, ‘21తో గేమ్ ఛేంజర్ అవ్వలేము.. 50 తీసుకోవాలి’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వచ్చిన ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహానికి దారితీసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ‘జై జగన్, జోహార్ వైఎస్సార్’ అంటూ కింద నినాదాలు వేశారు.