News July 10, 2024
కడప టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మృతి

కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మంగళవారం గుండుపోటుతో మృతి చెందారు. కుటుం సెలవులపై స్వగ్రామం నంద్యాలకు వెళ్లిన రామారావు(42) రెండు రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ రాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 9 గంటలకి మృతి చెందాడని తెలిపారు. వారి మరణానికి మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు.
Similar News
News February 23, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా

*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,750
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,490
*వెండి 10 గ్రాముల ధర రూ.2,700
News February 23, 2026
రాజంపేట: ఇంటర్ విద్యార్థికి యాక్సిడెంట్

పరీక్ష రాయాల్సిన విద్యార్థి ఆసుపత్రి పాలైన ఘటన ఇది. రాజంపేట డివిజన్ పిచ్చిగుంట్లపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థికి వీరబల్లిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పరీక్షా కేంద్రానికి బయల్దేరాడు. నీలవాండ్లపల్లి సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుపై తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని గుర్తించి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News February 23, 2026
కడప: 62 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు కడప జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 33,664 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. 1st ఇయర్ 17,100, 2nd ఇయర్ 16,564 మంది విద్యార్థులు ఉన్నారు. KDP-20, PDTR-8, MYKR, PRMML, BDVLలో 4, PVLD, JMDలో 3, KMLPRM, KJPTలో 2, మిగతా ప్రాంతాల్లో 1చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలు సమీప PSలకు చేర్చారు.


