News July 10, 2024

కడప టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మృతి

image

కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మంగళవారం గుండుపోటుతో మృతి చెందారు. కుటుం సెలవులపై స్వగ్రామం నంద్యాలకు వెళ్లిన రామారావు(42) రెండు రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ రాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 9 గంటలకి మృతి చెందాడని తెలిపారు. వారి మరణానికి మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు.

Similar News

News July 6, 2025

ఈనెల 7న కడపకు YS జగన్

image

ఈనెల 7వ తేదీ కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి YS జగన్ వస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కే.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. 7వ తేది మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 8న ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. మహానేత YS రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారని అన్నారు. అనంతరం పులివెందులకు మీదుగా బెంగళూరుకు చేరుకుంటారన్నారు.

News July 6, 2025

కడప: ‘రిమ్స్‌‌లో తనిఖీలు’

image

కడపలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సమితి సభ్యురాలు పద్మావతి శనివారం పర్యటించారు. పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎన్ఐసీయూలో పుట్టిన బిడ్డల ఆరోగ్య విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లైంగిక వేధింపుల కేసుల చికిత్సకు వచ్చే పిల్లలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించి ఆర్టీసీ అధికారులు, విద్యాలయ అధ్యాపకులతో చర్చించారు.

News July 5, 2025

ఎర్రగుంట్ల: ‘RTPPలో విద్యుత్ ఉత్పత్తి తగ్గింపు’

image

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)లో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించారు. ఇక్కడ పూర్తి ప్లాంట్ సామర్థ్యం 1650MW. వీటినుంచి ఏప్రిల్‌లో 839.98MU, మేలో 616.31MU, జూన్‌లో 729.28MU విద్యుత్ ఉత్పత్తి చేశారు. అయితే పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కేవలం 60% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(PLF) మాత్రమే ఉపయోగిస్తున్నారు. RTPPలో 210X5MW, 600X1MW యూనిట్లు ఉన్నాయి.