News April 5, 2024

కడప: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

image

రాజుపాలెం మండలం కూలూరు గ్రామం కుందూ నది వద్ద ట్రాక్టర్ కిందపడి డి.పెద్ద ఓబులేసు (35) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడుకు చెందిన పెద్ద ఓబులేసు పొలానికి మట్టి కోసం ట్రాక్టర్ తీసుకొని కుందూ నది వద్దకు వచ్చారన్నారు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి గాయపడిన అతడిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు.

Similar News

News October 15, 2025

జమ్మూలో కడప జిల్లా జవాన్ మృతి.!

image

కడప జిల్లా వేంపల్లి మండలం ముత్తుకూరుకు చెందిన BSF జవాన్ చపాటి నవీన్ (28) జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల ప్రాంతంలో అకస్మికంగా మృతి చెందారు. దీంతో మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించారు. కుటుంబాన్ని పోషించే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News October 15, 2025

మైదుకూరు: రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన కలెక్టర్

image

స్థానిక మైదుకూరులో రోడ్డు విస్తరణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విజ్ఞప్తి మేరకు కలెక్టర్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఇటీవల కొద్దిపాటి వర్షానికి మైదుకూరు రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. ఆ ప్రాంతంలోని ఇల్లు దుకాణాల్లోకి నీరు ప్రవహించింది. ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News October 14, 2025

ఎర్రగుంట్ల: రేపటి నుంచి నిరవధిక సమ్మె

image

ఎర్రగుంట్ల మండలంలోని ఆర్‌టీపీపీపీ మెయిన్ గేట్ వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. 2022లో నిలిచిపోయిన బకాయిలు వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడలో యాజమాన్యంతో నిన్న జరిగిన చర్చలు విఫలమవడంతో రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలన్నారు.