News October 26, 2024

కడప: ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ ద్వారా పర్యవేక్షణ

image

కడప నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జావేద్ తెలిపారు. ఈ మేరకు కడపలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను సమీక్షించారు. రాబోయే రోజుల్లో డ్రోన్ కెమెరా ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరాతీశారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News January 22, 2025

కడప: ‘నేరస్థులకు శిక్ష.. బాధితులకు న్యాయం’

image

నేరం చేసిన వారికి శిక్ష, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో కడప, అన్నమయ్య జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంతో, నిబద్ధతతో నేరాల కట్టడికి కృషి చేయాలన్నారు.

News January 22, 2025

కడప నగరం వరకే సెలవు

image

కడపలో ఇవాళ అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరాముడి కళ్యాణం, శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈవెంట్ నిర్వాహకులు, పాఠశాలల టీచర్ల విజ్ఞప్తి మేరకు అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు నేడు(బుధవారం) సెలవు ప్రకటించారు. ఈ సెలవు కేవలం కడప నగరం వరకే వర్తిస్తుంది. జిల్లాలోని ఇతర విద్యా సంస్థలు పనిచేస్తాయి. తామూ శోభాయాత్రకు వెళ్తామని.. తమకూ సెలవు కావాలని కడప పరిసర మండల వాసులు కోరుతున్నారు.

News January 22, 2025

శోభాయాత్రకు పకడ్బందీగా బందోబస్తు: డీఎస్పీ

image

కడపలో ఈరోజు ఉదయం అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే శ్రీరాముడి కళ్యాణం శోభాయాత్రకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప సబ్ డివిజన్ పరిధిలోని 9 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను బందోబస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లర్లకు ఎవరైనా పాల్పడిన ప్రేరేపించినా చర్యలు తప్పవన్నారు.