News September 10, 2024
కడప: డయల్ యువర్ కలెక్టర్‌కు విశేష స్పందన

డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన, సత్వర పరిష్కారం లభించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కలెక్టర్ శివశంకర్ లోతేటి నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం ఏడుగురు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబంధించిన శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కడప ఇన్‌ఛార్జ్ ఆర్డీఓ వెంకటపతి ఆదేశించారు.
Similar News
News February 28, 2026
కడప: ఇద్దరు MEOలు సస్పెండ్

ముద్దనూరు MEO-1 అన్నయ్య, కొండాపురం MEO-1 ఓబులేశును సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దనూరు మండలం చింతకుంట ఎంపీపీ స్కూల్‌లో గతంలో విధులు నిర్వర్తించిన ఓ ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరైనా కూడా MEOలు జీతాలు మంజూరు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో MEOలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
News February 27, 2026
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: జేసీ

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని శుక్రవారం DIEPC సమావేశంలో జేసీ నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 18 శాఖలకు సంబంధించి 11,033 దరఖాస్తులు వచ్చాయని, 10,886 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. 10,836 పరిశీలనలో, 50 పరిశీలనకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 88 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. 59 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచడం జరిగిందన్నారు.
News February 27, 2026
బి.మఠం: మృతులు బద్వేలు వాసులుగా గుర్తింపు

బ్రహ్మంగారిమఠం మండలం నంది పల్లె పాల డైరీ వద్ద లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు <<19255263>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతులు భార్యభర్తలు కావ్య, ప్రసాద్‌గా స్థానికులు గుర్తించారు.బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్తమ్మ నగర్‌లో నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. వీరి తల్లిదండ్రులు బద్వేల్ మున్సిపాలిటీ కుమ్మరి కొట్టాలలో ఉన్నారని తెలుస్తోంది.


