News November 25, 2024

కడప: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమ సమయంలో మార్పు

image

ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు జరుగుతున్న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమ సమయంలో మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజలు ఈ సమయ మార్పును గమనించి 08562-244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు

Similar News

News October 30, 2025

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలి: RDO

image

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని కడప RDO జాన్ ఇర్విన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సిద్దవటం MRO కార్యాలయంలో గురువారం PGRSపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రజా వేదికలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారులతో RDO చరవాణిలో మాట్లాడారు. అలాగే ఆయన గోల్డెన్ రికార్డ్స్, రీసర్వేపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

News October 30, 2025

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

కొండాపురంలోని పాత కొండాపురం సమీపంలో చిత్రావతి నది వంతెన సమీపంలో గురువారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అతను రైలు కింద పడడంతో అతని తల, మొండెం రెండు భాగాలుగా విడిపోయాయి. మృతుడి ఒంటిపై పసుపు కలర్ చొక్కా, బ్లూ కలర్ పాయింట్ ఉన్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 30, 2025

ప్రొద్దుటూరు: కుమారుని వివాహానికి వెళ్తూ తండ్రి మృతి

image

నెల్లూరు జిల్లాలో కుమారుని వివాహానికి వెళ్తూ ప్రొద్దుటూరుకు చెందిన బాషా సయ్యద్ పాల్ (50) మృతి చెందారు. బుధవారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన మృతి చెందారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. UPకి చెందిన సయ్యద్ పాల్ ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఆయనతో పాటు సమీప బంధువు సయ్యద్ ఆసిఫ్(20) కూడా మృతి చెందాడు.