News November 25, 2024
కడప: డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమ సమయంలో మార్పు
ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు జరుగుతున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమ సమయంలో మార్పులు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై ఈ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రజలు ఈ సమయ మార్పును గమనించి 08562-244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు
Similar News
News December 13, 2024
కీలక విషయాలు బయటపెట్టిన కడప కలెక్టర్
సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కడప కలెక్టర్ శ్రీధర్ కీలక విషయాలు బయటపెట్టారు. ‘వేరే జిల్లాలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్‌తో మా జిల్లాలో 3,600 మంది పింఛన్ తీసుకుంటున్నారు. వీరిపై అనుమానంతో తనిఖీలు చేయగా కేవలం 127 మందే అర్హులని తేలింది. మిగిలిన వాళ్లు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకున్నారు’ అని CMకు చెప్పారు. వెంటనే వారి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీ చేసి.. అవసరమైతే కేసు పెట్టాలని CM ఆదేశించారు.
News December 13, 2024
రాజంపేట: ఆటో డ్రైవర్ సూసైడ్
రాజంపేట మండలం ఆకేపాడు నవోదయ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ రాజశేఖర్ (37) కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. మద్యానికి బానిసైనా రాజశేఖర్ ఇంట్లో తన భార్య డ్వాక్రా కోసం ఉంచుకున్న డబ్బులు, కొంత నగలు అమ్మి మద్యానికి ఖర్చు చేశాడు. దీంతో భార్యాభర్తల ఇరువురి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 12, 2024
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు ఎప్పుడంటే?
కడప : పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.