News October 14, 2024

కడప: డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు వాయిదా

image

యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఈనెల 15వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ప్రభావం అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలపై ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Similar News

News November 24, 2025

విజేతలుగా కడప జిల్లా టీంలు

image

పులివెందలలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్‌లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్‌గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతే గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.

News November 24, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☞ బంగారం 24 క్యారెట్ 1 గ్రాము రూ.12,440
☞ బంగారం 22 క్యారెట్ 1 గ్రాము రూ.11,445
☞ వెండి 10 గ్రాములు రూ.1,577.

News November 24, 2025

ప్రొద్దుటూరులో అంతా జీరో వ్యాపారమే..?

image

ప్రొద్దుటూరులో జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఇక్కడ ఫైనాన్స్, బంగారం, హవాలా, సినిమా, రియల్ ఎస్టేట్, ఎలక్షన్స్‌లో ఇక్కడి వ్యాపారులు రూ.వేల కోట్లు పెట్టుబడులు, రుణాలు ఇస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇదంతా ప్రభుత్వ అనుమతులు, పన్నులు లేకుండానే సాగుతున్నట్లు సమాచారం. వ్యాపారి శ్రీనివాసులుపై జీరోలో అభరణాలు, స్కీములు, చీటీల వ్యాపారంపై ఇప్పుడు ఫిర్యాదులు వచ్చాయి.