News November 14, 2024
కడప: డిగ్రీ ఫలితాలు విడుదల
యోగివేమన విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ 7, 8, LLB సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను కులసచివులు ప్రొఫెసర్ పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు, సహాయ నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస రావుతో కలిసి విడుదల చేశారు. యోగివేమన విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో ఎల్.ఎల్.బి, డిగ్రీ పరీక్ష ఫలితాలను ఆమె విడుదల చేశారు.
Similar News
News November 15, 2024
పుష్పగిరి వద్ద పెన్నా నదిలో వ్యక్తి గల్లంతు
వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద పెన్నా నదిలో దిగి గణేశ్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పుష్పగిరిలో పూజలు నిర్వహించడానికి కడప ఎన్జీవో కాలనీకి చెందిన గణేశ్ కుటుంబ సమేతంగా పుష్పగిరికి వచ్చి, నీటిలో దిగి గల్లంతైనట్లు సమాచారం. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 15, 2024
జమ్మలమడుగు: పుష్ప-2 క్రేజ్ మామూలుగా లేదుగా!
ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ‘పుష్ప-2’ మేనియా ఓ రేంజ్లో ఉంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా ఎక్కడికక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలబ్రేషన్స్కు ప్లాన్ చేసుకుంటున్నారు. భారీ కటౌట్లు, ప్రత్యేక కార్యక్రమాలతో థియేటర్ల వద్ద హడావుడి చేసేందుకు రెడీ అవుతున్నారు. జమ్మలమడుగులో భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్నామని ఫ్యాన్స్ ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
News November 15, 2024
కడప: బిజినెస్ వైపు మహిళా సంఘాలను ప్రోత్సహించాలి.!
కడప జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలను ఈ-కామర్స్ బిజినెస్ వైపు అడుగులు వేయించి ప్రపంచ గుర్తింపుతో పాటు సంపూర్ణ సాధికారిత సాధించేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఏ, మెప్మా, డ్వామా పరిధిలో వివిధ రకాల పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. మహిళాభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని తెలిపారు.