News July 21, 2024

కడప: తల్లిపై బ్లేడ్‌తో కుమారుడి దాడి

image

మద్యం కోసం డబ్బు ఇవ్వలేదని కోపంతో బ్లేడుతో తల్లిపై కొడుకు దాడి చేసిన ఘటన కడపలో జరిగింది. నగరంలోని రాజారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న కొండమ్మపై అమె కుమారుడు రాకేశ్ శనివారం బ్లేడుతో దాడి చేశాడు. తనకు మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఆమె కుమారుడు తల్లిపై బ్లేడుతో దాడి చేయడంతో ఆమె చేతికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Similar News

News October 25, 2025

కడప: ఒక్కరోజే 950 మందిపై కేసు..!

image

కడప జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు శుక్రవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో 219 ద్విచక్రవాహనాలు, 21 ఆటోలు, ఒక గూడ్స్ ఆటో, 950 మందిపై మోటారు వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు గాను రూ .2,449,50 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహన సేఫ్టీపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.

News October 25, 2025

కడప జాయింట్ కలెక్టర్‌కు మరో బాధ్యత

image

కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కుడా) వైస్ ఛైర్మన్‌గా జేసీ అతిథి సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు అథారిటీలకు జాయింట్ కలెక్టర్లను నియమించారు. కడప జిల్లాకు జేసీ అతిథి పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

News October 24, 2025

కడప: స్కూళ్లకు సెలవులపై DEO కీలక ప్రకటన

image

కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో DEO షంషుద్దీన్ కీలక ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా స్కూళ్లను నిర్వహించలేని పరిస్థితులు ఉంటే అక్కడి హెచ్ఎంలు, ఎంఈఓలు డిప్యూటీ DEOల అనుమతితో సెలవు ప్రకటించుకోవచ్చని తెలిపారు.