News September 2, 2024
కడప: తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు

కడప నుంచి విశాఖపట్నం వెళ్ళే తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు రద్దయింది. రైలు నంబర్ (17487) విజయవాడ ప్రాంతంలో రైల్వే ట్రాక్ మీద నీరు నిలిచి, రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వలన రైలును నేడు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ప్రకటనలో తెలిపారు. కావున ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News December 4, 2025
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం చేయించాలనుకునేవారు ఒక్కో టికెట్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.
News December 4, 2025
కడప: ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతులపై ఆరా.!

కడప జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల అనుమతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రొద్దుటూరులో ప్రభుత్వ యాజమాన్యంలో జిల్లా ఆస్పత్రి, 6 అర్బన్ హెల్త్ సెంటర్లు, యునాని, హోమియో, ఆయుర్వేదం ఆస్పత్రులు ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యంలో 108 అల్లోపతి, 30 డెంటల్, 10 పిజియో థెరపీ, 8 హోమియో, 4 ఆయుర్వేదం ఆసుపత్రులు ఉన్నాయి. 38 డయాగ్నస్టిక్ స్కానింగ్ కేంద్రాలు, 13 ల్యాబ్‌లు ఉన్నాయి.
News December 4, 2025
ముద్దనూరు: వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్

వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చింత ప్రదీప్ ఎంపికయ్యారు. ఈయన ముద్దనూరు మండల పరిధిలోని రాజు గురువాయిపల్లికి చెందిన వ్యక్తి. బుధవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రదీప్‌ను నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు.


